నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఊహించన షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు. బండి సంజయ్ కుమార్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని… ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు జిల్లా ఎస్పీ రంగనాథ్.
నిన్నటి బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్భం క్రమంలో జరిగిన ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయని ఎస్పీ వెల్లడించారు.
