హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్లో విషాదం నెలకొంది. ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. కడప జిల్లా బద్వేల్ కి చెందిన రాజ్ కుమార్ నగరంలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వివిధ మానసిక వత్తిళ్ళతో బాధపడుతున్నారు.
తాజాగా సెలెన్లో విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక పరంగా ఇబ్బందులు పడుతున్నందునే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు మరే కారణాలు ఏవైనా వున్నాయా అనే కోణంలో ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
