బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
Read: 1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత
ఏడుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదం బల్గేరియా చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోవడంతో లోపల ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేకుండా పూర్తిగా కాలిపోయాయి.
