NTV Telugu Site icon

విశాఖ‌లో వింత జాత‌ర‌… బుర‌దనీళ్లు చ‌ల్లుకుంటూ…

దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ర‌కాల జాత‌ర‌లు జ‌రుగుతుంటాయి.  పట్ట‌ణాలు, న‌గ‌రాల్లో జ‌రిగే జాత‌ర‌ల గురించి మ‌న‌కు తెలుసు.  అయితే, కొన్ని ర‌కాల జాత‌ర‌లు చాలా విచిత్రంగా ఉంటాయి.  ఇలా కూడా జార‌త‌లు నిర్వ‌హిస్తారా అని ఆశ్చ‌ర్య‌పోతుంటాం.  విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండ‌ల్లోని దిమిలి అనే గ్రామం ఉంది.  ఆ గ్రామంలో గ్రామ దేవ‌త ద‌ల్ల‌మాంబ అనువు మ‌హోత్స‌వాన్ని గ్రామ‌స్తులు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.  రేపు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఈ జాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.

Read: డిజిట‌ల్ క‌రెన్సీకి పావులు క‌దుపుతున్న ఇండియా… ఎందుకంటే…

జాత‌ర తెల్ల‌వారు జామున ప్రారంభ‌మైన, ఈ ఉత్స‌వానికి సంబంధించిన ఏర్పాట్లు, హ‌డావుడి అర్థ‌రాత్రి నుంచే మొద‌లౌతుంది.  గ్రామ‌స్తులు వేప మండ‌ల‌ను తీసుకొని, బుర‌ద‌లో ముంచి ఆ నీళ్ల‌ను ఒక‌రిపై ఒక‌రు చ‌ల్లుకుంటారు.  ఇలా చేయ‌డం వ‌ల‌న ఎలాంటి చ‌ర్మ‌వ్యాధులు రావ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.  అమ్మ‌వారు బుర‌ద‌లో దొరికింది కాబ‌ట్టి అక్క‌డి అమ్మ‌వారికి బుర‌ద‌మాంబ అని పేరు పెట్టి పూజ‌లు చేస్తుంటారు.  బుర‌ద చ‌ల్లుకున్నాక ఆ వేప కొమ్మ‌ల‌ను అమ్మ‌వారి విగ్ర‌హం ముందు ఉంచి పూజ‌లు చేస్తారు.