Site icon NTV Telugu

సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌…

సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేశారు.  సిరివెన్నెల ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్నార‌ని, నిపుణులైన వైద్యుల‌తో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి వైద్యం అందిస్తున్నామ‌ని కిమ్స్ వైద్యులు తెలిపారు.  సిరివెన్నెల ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని వైద్యులు తెలియ‌జేశారు.  న్యూమోనియాతో బాధ‌ప‌డుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుప‌త్రిలో చేరారు.   సిరివెన్నెల సినిమాలో సీతారామ‌శాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఫేమ‌స్ అయ్యారు.  సిరివెన్నెల త్వ‌ర‌గా కొలుకొని తిరిగి మంచి పాట‌లు రాయాల‌ని తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ కోరుకుంటోంది. 

Read: ప్ర‌పంచం కొత్త వేరియంట్‌తో భ‌య‌ప‌డుతుంటే… చైనా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతోంది…

Exit mobile version