NTV Telugu Site icon

భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?

బ్రిటీష‌ర్లు భార‌త దేశాన్ని ప‌రిపాలించే రోజుల్లో అనేక రకాలైన ప‌న్నులు విధించేవారు.  ఆ పన్నులు మ‌రీ దారుణంగా, సామాన్యులు భ‌రించ‌లేనంత‌గా ఉండేవి.  సామాన్యుల‌తో పాటుగా వ్యాపారులు సైతం ఆ ప‌న్నుల‌కు భ‌య‌ప‌డిపోయేవారు.  కాని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌న్నుల‌కు ఒప్పుకోవాల్సి వ‌చ్చేది.  తొలి స్వాతంత్య్ర స‌గ్రామం స‌మ‌యంలో మ‌న దేశంలో గుజ‌రాత్ ప్రాంతంలోని క‌చ్‌లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్ప‌త్తి అయ్యేది.  అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీష‌ర్లు ప‌న్నును వేసేవారు.  

ఈ ప‌న్నుల‌కు ఒప్పుకున్న వారికే ఉప్పు క్షేత్రాల‌ను లీజుకు ఇచ్చేవారు.  ప‌న్నుల‌కు దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేని చాలామంది ఉప్పును వివిధ మార్గాల్లో బ్రిటీష‌ర్ల‌కు తెలియ‌కుండా చేర‌వేసి అమ్ముకునేవారు.  ఇది గ‌మ‌నించిన బ్రిటీష్ పాల‌కులు ఈ అక్ర‌మ అమ్మ‌కాల‌ను చెక్ పెట్టేందుకు కంచెను నిర్మించాల‌ని అనుకున్నారు.  పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి ఒడిశాలోని మ‌హాన‌ది వ‌ర‌కు మొత్తం 4 వేల కిలోమీట‌ర్ల  దూరం కంచెను నిర్మించేందుకు ప్లాన్ చేశారు.

Read: ఇదేం ఫ్యాష‌న్‌రా బాబు… ఆమెను చూసి ప‌రుగులు తీస్తున్నారు…

దీనికోసం తుమ్మ చెట్లు, ముళ్ల చెట్ల‌ను నాటారు.  1869లో ఈ కంచె నిర్మాణం ప్రారంభం అయింది.  1872లో ఈ కంచె నిర్మాణం కోసం 14000 మంది సిబ్బందిని వినియోగించారు.  ఈ కంచెను అంత‌ర్గ‌త క‌స్ట‌మ్స్ రేఖ‌గా పిలిచేవారు.  ప్ర‌తి నాలుగు మైళ్ల‌కు ఒక చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.  అయితే, ఒంటెల ద్వారా, ఎద్దుల బండ్ల ద్వారా కంచెను దాటుకొని ఉప్పును త‌ర‌లించేవారు.  ఈ కంచె నిర్మాణం, మెయింటెన్స్ పెను భారంగా మార‌డంతో బ్రిటీష్ వారు 1879 నుంచి ఆ కంచెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు.