Site icon NTV Telugu

ఆంజనేయుడు మళ్లీ పుట్టాడా?… తోకతో జన్మించిన బాలుడు

బ్రెజిల్‌లో ఓ మగశిశువు వైద్యులనే ఆశ్చర్యపోయేలా జన్మించాడు. ఎందుకంటే అతడు తోకతో పుట్టాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 ఏళ్ల గర్భిణీ పురుటినొప్పులతో ఆల్బర్ట్ సాబిన్ అనే పిల్లల ఆస్పత్రిలో చేరింది. సాధారణ కాన్పు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు నోరెళ్లబెట్టారు. 12 సెంటీమీటర్లు ఉన్న బాలుడి తోకకు చివరలో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉందని వైద్యులు వెల్లడించారు.

Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరింత పెరగనున్న చలి

అయితే బాలుడికి ఉన్న తోక చర్మానికి మాత్రమే పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ద్వారా తోకను తొలగించినట్లు వారు తెలిపారు. కాగా మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో 9 నెలలుగా తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ తోకను వైద్యులు నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్నారు.

Exit mobile version