NTV Telugu Site icon

వైర‌ల్‌: కేఫ్‌లో వ‌ర్క‌ర్ మాప్ డ్యాన్సింగ్‌… చివ‌ర్లో ట్వీస్ట్‌…

ఎంత ప‌ని ఒత్తిడినైనా న‌చ్చిన విధంగా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా చేయ‌వ‌చ్చు.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయ‌వ‌చ్చు.  కొంత‌మంది ఆడుతూ పాడుతూ ప‌నిచేసుకుంటారు.  కొంత‌మంది ప‌నిచేసే స‌మ‌యంలో కూడా డ్యాన్స్ చేస్తూ ప‌ని చేస్తుంటారు.  అలాంట‌ప్పుడు చేస్తున్న ప‌నిలో ఎలాంటి అల‌స‌ట క‌నిపించ‌దు.  ద‌క్షిణ కొరియాలోని ఓ కేఫ్‌లో ప‌నిచేసే మ‌హిళ కేఫ్ ప్లోర్‌ను తుడుస్తూ డ్యాన్స్ చేయ‌డం మొద‌లు పెట్టింది.  అలా డ్యాన్స్ చేస్తుండ‌గా డోర్ ఒపెన్ చేసుకొని ఓ వ్య‌క్తి లోనికి వ‌చ్చాడు.  

Read: కెన్యాలో భారీ క‌రువు… మృత్యువాత పడుతున్న వ‌న్య‌ప్రాణులు…

అలా వ‌చ్చిన వ్య‌క్తి ఆ యువ‌తి చేస్తున్న డ్యాన్స్ ను చూస్తూ అలా నిల‌బ‌డిపోయాడు.  స‌డెన్‌గా వెన‌క్కి తిరిగి ఆ యువ‌తి వ‌చ్చిన వ్య‌క్తిని చూసి డ్యాన్స్ ఆపేసింది.  వెంట‌నే ఆ వ్య‌క్తి చ‌ప్ప‌ట్లు కొట్టి  డ్యాన్స్‌ను మెచ్చుకున్నాడు.  ఆమె న‌మ‌స్కారం పెట్టి అక్క‌డి నుంచి వెళ్లింది.  అయితే వ‌చ్చిన వ్య‌క్తి బాస్ కావ‌డంతో అలా చేసింద‌ని కొందరు చెబితే, వ‌చ్చింది క‌స్ట‌మ‌ర్ అని, క‌స్ట‌మ‌ర్‌కి రెస్పెక్ట్ ఇచ్చేందుకు ఆమె డ్యాన్స్ ఆపేసి న‌మస్క‌రించి అక్క‌డి నుంచి వెళ్లిపోయింద‌ని చెప్పుకొచ్చారు.  ఏదైతేనేం 48 సెకన్ల ఈ చిన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టం విశేషం.  

https://twitter.com/i/status/1470494052420304903