Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ వేళ.. బూస్టర్‌ డోస్‌ ఉత్తమం : WHO

యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది.

కరోనా వేరియంట్లతో పొల్చితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు భిన్నంగా ఉన్నయని తెలిపింది. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకోని వారికి, ఒక్క డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఈ వైరస్‌ సోకుతోందన్నారు. అంతేకాకుండా రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ సోకిందని కానీ వారిలో చాలా స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ ఉత్తమమని డబ్లూహెచ్‌ఓ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Exit mobile version