ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు ప్రయాణిస్తున్న కారుపై ఆరుగురు దుండగులు రెండు బాంబులు విసిరారు. కారు బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ కుమారుడు విధాన్ సింగ్‌కు చెందినది. రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు విండ్‌షీల్డ్‌పై రెండు బాంబులను విసిరారు. పోలీసులు వచ్చేలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Vande Bharat Train : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు
నిన్న రాత్రి 8 గంటల సమయంలో విధాన్ సింగ్ (20) తన అత్త ఇంటికి వెళ్లగా దాడి జరిగింది. అయితే, ఈ దాడి నుంచి విధాన్ సింగ్, అతని సహచరుడు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఓ పోలీసు కానిస్టేబుల్ కొడుకుతో విధాన్ సింగ్ గొడవ పడ్డాడు. కానిస్టేబుల్ శివబచన్ యాదవ్ కుమారుడు శివమ్ యాదవ్ బాంబు దాడిలో అనుమానితుడిగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుక శివం యాదవ్ హస్తం ఉందని బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ ఆరోపించారు. ఆమె జూసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై FIR నమోదు చేయబడింది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిరాగ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, విజయలక్ష్మి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు.
