డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా షార్జా జైలు నుంచి విడుదలైంది. పెరీరా తన వద్ద ఉన్న ట్రోఫీలో డ్రగ్స్‌ను దాచి ఉంచడంతో అధికారులు ఈ నెల ప్రారంభంలో షార్జాలో అరెస్టు చేశారు. సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో క్రిసాన్ పెరీరా నటించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బాలీవుడ్ నటిని ఇరికించారనే ఆరోపణలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసింది. నిందితులు ముంబైలోని బోరివలి నివాసి ఆంథోనీ పాల్, అతని సహచరుడు, మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాకు చెందిన రాజేష్ బభోటే అలియాస్ రవిగా గుర్తించారు.
Also Read: Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని దందా!
నటిని ఇరికించారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించడంతో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రిసాన్ పెరీరా షార్జాకు తీసుకెళ్లిన ట్రోఫీలో వీరిద్దరూ డ్రగ్స్ దాచిపెట్టారు. నటి తల్లి ప్రేమిలా పెరీరాపై ప్రతీకారం తీర్చుకునే చర్యగా క్రిసాన్‌ను కేసులో ఇరికించే ప్రణాళికను పాల్ సూత్రధారి అని పోలీసులు తెలుసుకున్నారు. పాల్, అతని సహచరుడు రవితో కలిసి, అంతర్జాతీయ వెబ్ సిరీస్ కోసం ఉద్దేశించిన ఆడిషన్ కోసం క్రిసాన్‌ను యుఎఇకి పంపడానికి పథకం పన్నాడు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్ దాచిన ట్రోఫీని ఆమెకు అందజేశారు. ఇదే తరహాలో పాల్ మరో నలుగురిని ఇరికించాడని అధికారులు గుర్తించారు.