NTV Telugu Site icon

24 ఏళ్ల నుంచి ఆ విమానం అక్క‌డే…

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా వినియోగించే విమానాలను బోయింగ్ సంస్థ త‌యారు చేస్తున్న‌ది.  బోయింగ్ సీరిస్‌లో ఎన్నో విమానాలు ఉన్నాయి.  అందులో బోయింగ్ 720 విమానం అప్ప‌ట్లో బాగా ఫేమ‌స్ అయింది.  ఈ విమానం ఖ‌రీదు కూడా ఎక్కువే.  అయితే, 24 ఏళ్ల క్రితం బోయింగ్ 720 విమానం ఎమ‌ర్జెన్సీగా ఇండియాలోని నాగ‌పూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది.  

Read: అక్కడ చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్… స‌ర్వ సిద్ధం…

కొన్ని కార‌ణాల వ‌ల‌న ఎమ‌ర్జెన్సీగా ల్యాండ్ అయిన విమానం అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డే ఉండిపోయింది.  నిరుప‌యోగ‌మైన ర‌న్‌వే మీద బోయింగ్ 720 విమానంను వ‌దిలేశారు.  ఈ విమానం గురించి సోష‌ల్ మీడియాలో ర‌కర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.  1991లో నాగ‌పూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది.  ఇప్పుడు ఎగిరేందుకు ఆ విమాన ఇంజ‌న్ సిద్ధంగా లేద‌ని అధికారులు చెబుతున్నారు.  ఈ విమానానికి సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.