అక్కడ చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్… స‌ర్వ సిద్ధం…

క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  అమెరికాలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా జ‌రుగుతున్న‌ది.  12 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి అక్క‌డ వ్యాక్సిన్ ఇప్ప‌టికే అందిస్తున్నారు.  కాగా 5-11 ఏళ్ల వ‌య‌సున్న చిన్నారుల‌కు వ్యాక్సిన్ అందించ‌బోతున్నారు.  ఫైజ‌ర్ ఎన్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసిన చిన్నారుల ఫైజ‌ర్ టీకాకు ఎఫ్‌డీఎ అనుమ‌తులు మంజూరు చేసింది.

Read: వైర‌ల్‌: మృగాడి నుంచి కుక్క‌ను కాపాడిన గోమాత‌…

దీంతో ఈ వ్యాక్సిన్‌ను చిన్నారుల‌కు అందించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది.  న‌వంబ‌ర్ 8 నుంచి ఈ వ్యాక్సిన్‌ను వేగంగా అందించేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తున్న‌ది.  2.8 కోట్ల మంది చిన్నారుల‌కు వ్యాక్సిన్‌ను అందించ‌బోతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  మ‌హ‌మ్మారిని అడ్డుకోవాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం అని, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles