NTV Telugu Site icon

భూమికి ద‌గ్గ‌ర‌గా ఏలియ‌న్లు… మిస్ట‌రీగా మారిన ఆ శాటిలైట్‌…

ఏలియ‌న్లు ఉన్నాయా లేవా అనే విష‌యం తెలుసుకోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నాయి.  భూమిని పోలిన గ్ర‌హాలు విశాల‌మైన విశ్వంలో చాలా ఉన్నాయ‌ని అయితే, వాటిని గుర్తించ‌డం ముఖ్య‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబ‌ర్ 2 వ తేదీన అంత‌రిక్షంలో భూమికి ద‌గ్గ‌ర‌గా ఓ న‌ల్ల‌ని వ‌స్తువు క‌నిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వ‌స్తున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.  1930 నుంచి ఆ న‌ల్ల‌ని వ‌స్తువు నుంచి సిగ్న‌ల్స్ వ‌స్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.  దీనిపై నాసా స్పందించింది.  ఇది రాకెట్‌కు సంబందించిన శ‌క‌లం కావోచ్చ‌ని, లేదంటే విశ్వంలో జ‌రిగే విస్పోట‌నాల కార‌ణంగా ఏర్ప‌డిన శ‌క‌ల‌మైనా కావొచ్చ‌ని, ఇలాంటివి అప్పుడ‌ప్పుడు భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశిస్తుంటాయ‌ని, ఏలియ‌న్స్ శాటిలైట్ కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

Read: రివ్యూ: ది బేకర్ అండ్ ది బ్యూటీ (వెబ్ సీరిస్)