NTV Telugu Site icon

Chennai: కారుపై నాటు బాంబులతో దాడి.. బిజెపి నేత దారుణ హత్య

Murder

Murder

తమిళనాడులో దారుణం జరిగింది. బిజెపి నేత దారుణ హత్య గురయ్యారు. ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. గురువారం రాత్రి పూందిపలై హైవే నుండి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి పరుగెత్తుకుంటూ వెలుతున్న బీజేపీ నేత శంకర్ ను వెంటాడి చంపారు. వరపురం పంచాయతీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, బీజేపీ ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పిబిజి శంకర్ పనిచేస్తున్నారు. హత్య ఎన్నికల సమయంలో జరిగినా గోడవలే కారణమా లేక రియల్ ఎస్టేటు పోటీలో వచ్చిన గోడవగా అనుమానిస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:Pakistan: రైలులో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

శంకర్‌ చెన్నై నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. పూనమలీ సమీపంలోని నజరత్‌పేట జంక్షన్‌ వద్దకు కారు రాగానే ఓ ముఠా కారుపై నాటు బాంబు విసిరింది. దీంతో శంకర్ కారు దిగి పరుగు ప్రారంభించాడు. ఆ ముఠా అతడిని వెంబడించి నరికి చంపింది. నజరత్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య చేసిన ముఠా ఎవరనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Show comments