Site icon NTV Telugu

హుజురాబాద్‌ బై పోల్‌ : ఆరో రౌండ్‌లో అదరగొట్టిన ఈటల..

ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యత సాధించారు.

నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్‌లో కూడా ఈటల తన సత్తా చాటి 2,169 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇప్పుడు ఆరో రౌండ్‌లోనూ ఆధిక్యత సాధించి.. ఆరో రౌండ్‌ లో 1,017 ఓట్ల మెజార్టీ రావడంతో.. ఆరో రౌండ్ ముగిసే సరికి 3,186 ఓట్ల లీడ్ంగ్‌ లో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల వారీగా ఓట్లను లెక్కిస్తున్నారు.

Exit mobile version