ఏడోసారి ఈటల విజయం.. ఫైనల్ మెజార్టీ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్ అయ్యాయి.. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 23,855 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు.
హోరాహోరీ పోరు జరిగిన హుజురాబాద్‌లో కమలం వికసించింది.. సర్కార్‌కు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటల.. తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. అడుగడునా ఈటలను వెంటాడినా.. ఎక్కడా ఆయనను మించలేకపోయారు. 22వ రౌండ్ ఫలితాల్లో 1130 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా బీజేపీ 23,855 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు చెప్పుకోతగినన్ని ఓట్లు కూడా పడలేదు.
Also Read
తొలి ఐదు రౌండ్లలో హుజురాబాద్ ఓట్లను లెక్కించారు.. మొదటి రౌండ్లో 166 ఓట్లతో మొదలైన ఈటల రాజేందర్ మెజార్టీ ప్రస్తానం.. ఐదో రౌండ్ వచ్చేసరికి 2169కి చేరింది.. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగినా ఓటర్లు మాత్రం ఈటల వెనుకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్ 6, 7 రౌండ్లలోనూ కనిపించింది. ఆరో రౌండ్లో ఈటలకు 1017 ఓట్ల ఆధిక్యం లభించగా.. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల మెజార్టీ 3432కు చేరింది. కానీ, ఎనిమిదో రౌండ్లో కారు దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్ వెనుక నిలబడింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. అయితే, 9, 10 రౌండ్లలో మళ్లీ ఈటల హవా కనిపించింది. ఇక, 11వ రౌండ్లో మళ్లీ టీఆర్ఎస్కు 385 ఓట్ల ఆధిక్యం లభించింది.. అప్పటికి ఈటల మొత్తం ఆధిక్యం 5306గా ఉంది. కానీ, ఇక, అక్కడి నుంచి ఈటల వెనక్కి మళ్లి చూడాల్సిన అవసరం రాలేదు.. ప్రతీ రౌండ్లోనూ ఈటల లీడ్ సాధించారు.. క్రమంగా ఆయన మెజార్టీ పెరుగుతూ పోయింది. ఇక, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఇది ఏడో సారి కావడం విశేషం. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు ఈటల రాజేందర్.
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!