టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు బల్మూరీ వెంకట్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల ను ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈనెల 30 వ తేదీన హుజురాబాద్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. మూడు పార్టీలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
Read: పాక్ మరో కుట్ర: డ్రోన్ ద్వారా జమ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…