పాక్ మ‌రో కుట్ర‌: డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…

జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో కుట్ర చేసేందుకు పాక్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉగ్ర‌వాదుల‌ను ఇండియాలోకి చొర‌బ‌డేందుకు ప‌రోక్షంగా పాక్ స‌హ‌క‌రిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాల‌ను దేశ స‌రిహ‌ద్దుల్లో జార‌విడుస్తోంది.  ఇప్ప‌టికే ఇలాంటి డ్రోన్ల‌ను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు.  కాగా తాజాగా మ‌రో డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించింది.  ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగ‌జైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును ప‌సుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు ఆరు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సౌజానా గ్రామంలో జార‌విడిచారు.  అయితే, డ్రోన్ శ‌బ్దాన్ని గుర్తించిన ఓ స్థానికుడు వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించారు.  భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో క‌లిసి పోలీసులు రంగంలోకి దిగి సౌజానా గ్రామంలో కూబింగ్ నిర్వ‌హించారు.  డ్రోన్ నుంచి జార‌విడిచిన ప్యాకెట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  పాక్ నుంచి వ‌చ్చిన డ్రోన్ ఆయుధాల‌ను ఎవ‌రికోసం జార‌విడిచింది, దానిని ఎవ‌రు అందుకోబోతున్నారు అనే విష‌యాల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Read: కిమ్ సోద‌రికి మ‌రో కీల‌క ప‌ద‌వి… కొరియాలో మొద‌లైన టెన్ష‌న్‌…

-Advertisement-పాక్ మ‌రో కుట్ర‌:  డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు...

Related Articles

Latest Articles