Site icon NTV Telugu

ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీల‌క వ్యాఖ్య‌లు…

ఒమిక్రాన్ కేసులు ప్ర‌పంచంలో తీవ్రంగా పెరుగుతున్నాయి.  కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ‌టంతో ప్ర‌పంచం యావ‌త్తు అత‌లాకుత‌లం అవుతున్న‌ది.  ఒమిక్రాన్‌పై ఇటీవ‌లే బిల్‌గేట్స్ ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే.  ఒమిక్రాన్ ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు.  ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేసిన రెండు రోజుల్లోనే ప‌రిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది.  ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెంద‌డం మొద‌లుపెట్టాయి.  దీంతో బిల్‌గేట్స్ త‌న ప్ర‌క‌ట‌న‌పై యుట‌ర్న్ టీసుకున్నారు.  ప్ర‌పంచం చాలా దారుణ‌మైన ద‌శ‌కు చేరుకుంటుంద‌ని, రానున్న రోజులు మ‌రింత కీల‌కంగా మార‌నున్నాయ‌ని, వ‌చ్చే ఏడాదిలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్ష‌భాల్ని ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌ని ట్వీట్ చేశారు.  

Read: కేంద్రాన్ని బద్నం చేస్తున్నారు : ప్రదీప్‌ కుమార్‌

సెల‌వ‌ల‌ను త‌న బంధువుల‌తో క‌లిసి ఆస్వాదిద్దామ‌ని అనుకున్నాన‌ని, కాని, త‌న హితులు, స‌న్నిహితులు సైతం ఒమిక్రాన్ బారిన ప‌డ‌టంతో అన్నిర‌కాల కార్య‌క్ర‌మాల‌ను రద్ధు చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.  చ‌రిత్ర‌లో ఏ వైర‌స్ కూడా ఒమిక్రాన్ అంత‌టి వేగంగా విస్త‌రించ‌లేద‌ని, అన్ని దేశాల‌ను ఒమిక్రాన్ చుట్టేస్తోంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఒమిక్రాన్ తారాస్థాయికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.  స‌రైన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటే 2022 లో క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.

Exit mobile version