బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు.. మొదటి నుంచే జనాలను ఆకట్టుకుంటున్నారు.. హౌస్ లో జరిగిన శివాజీ, షకీలా, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ సందడితో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా కనిపించింది.. ఇక రెండో రోజు బిగ్ బాస్ లో జరిగిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా ప్రవేశించిన నవీన్ పోలిశెట్టి హంగామా నేడు కూడా కొనసాగింది. డార్క్ రూమ్ లోకి ప్రవేశించిన నవీన్ కాసేఫు కంటెస్టెంట్స్ ని ఆటపట్టించాడు. శోభా శెట్టి నేను శెట్టి అంటూ పోలిశెట్టితో పరిచయం చేసుకుంది. దీనితో నవీన్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. వెంటనే నవీన్ పోలిశెట్టి కంటెస్టెంట్స్ చేత దగ్గరుండి పులిహోర కలిపించే ఫన్నీ టాస్క్ పెట్టాడు. లేడీ లక్ అంటూ తమకు ఇష్టమైన లేడీ కంటెస్టెంట్స్ కి జెంట్స్ తో బ్యాండ్స్ కట్టించాడు.. ఈ సీన్ కాస్త రసవత్తరంగా ఉంటుంది.
మొదటిరోజు హౌస్ లో జరిగిన దానికి గుర్తుచేసుకున్నారు.. అందులో హీరో శివాజీ నాగార్జున ఇచ్చిన 35 లక్షల ఆఫర్ గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. 35 లక్షలు వదులుకుని తప్పు చేశానని సరదాగా కామెంట్స్ చేశారు. ఇక రతిక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఆమెకి ఇచ్చిన టాస్క్ ప్రకారం అమర్ డీప్ కి, ప్రియాంక జైన్ కి మధ్య గొడవలు పెట్టాలి.. ఆ తర్వాత తేజ షకీలాను బోల్డ్ ప్రశ్నతో కెలికి బుక్కయ్యాడు. మీరు అవకాశాలు లేక అడల్ట్ సినిమాలు చేశారా లేక కావాలనే ఇష్టంతోనే ఆ తరహా చిత్రాలు చేశారా ? ఆ పాత్రలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది ? మీ కుటుంబ సభ్యులు ఏమి అనలేదా అని ప్రశ్నించాడు. ఏంట్రా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అంటూ షకీలా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నాకు ఆ తరహా పాత్రలు వచ్చాయి కాబట్టే చేశాను. గ్లామర్ సాంగ్స్ చేస్తే లేని తప్పు గ్లామర్ రోల్స్ చేస్తే తప్పేంటి అని షకీలా అభిప్రాయ పడ్డారు.. అనంతరం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మొదలు పెట్టింది.. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారో అనేది ఆసక్తిగా మారింది..