NTV Telugu Site icon

మాన్సాస్ ట్రస్ట్‌ వివాదంలో మరో ట్విస్ట్..

urmila gajapathi raju

urmila gajapathi raju

మాన్సాస్ ట్రస్ట్‌ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు న్యాయవాది.. అశోక్ గజపతి రాజును‌ చైర్మన్‌గా తొలగించి ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని వాదించారు… అయితే, ఈ కేసులో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం.

కాగా, సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్డుకు, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించడం వివాదాస్పదం అయ్యింది.. అయితే, దీనిపై కోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతి రాజు.. చివరకు తిరిగి మళ్లీ ఛైర్మన్ అయ్యారు. సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించడం చట్ట వ్యతిరేకం అని హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా మరో ట్విస్ట్‌ ఇస్తూ.. ఇప్పుడు ఊర్మిళ గజపతి రాజు కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.