బిగ్‌బాస్-5 తెలుగు రియాల్టీ షో 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉండగా.. వీరిలో ముగ్గురిని శనివారం నాడు నాగార్జున సేవ్ చేశారు. సేవ్ అయిన ముగ్గురిలో రవి, సన్నీ, సిరి ఉన్నారు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Read Also: మానస్ – పింకీ మధ్య ఏం జరుగుతోంది!?
అయితే ఈ వారం హౌస్ నుంచి కండల వీరుడు విశ్వ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. మిగతా వారితో పోలిస్తే అతడికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. విశ్వ తర్వాత జెస్సీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ వారం అతడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో టాస్కులలో సరిగ్గా ఫర్ఫార్మ్ చేయలేదు. దీంతో ప్రేక్షకులు జెస్సీకి కూడా తక్కువ ఓట్లు వేశారు. బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్‌తో స్నేహం చేస్తున్న కారణంగా ఆ మాత్రం ఓట్లయినా పడ్డాయని తెలుస్తోంది. అయితే ఫిజికల్ టాస్క్‌లలో విశ్వను కొట్టేవాడే లేడు. అతడిని ఆపాలని విశ్వ ప్రయత్నం చేసినా ఎవరితరం కావడంలేదు. టాస్క్ అనేసరికి విశ్వ విజృంభిస్తుంటాడు. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయడం వెనుక వ్యూహం ఏంటో బిగ్ బాస్‌కే తెలియాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.