కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాసాలమర్రిలో ఇచ్చినట్టుగా.. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా దళిత బంధు ఇస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయనని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ కూడా రాసిస్తానన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోజరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని.. తర్వాతే పదవులు అన్నారు. ఇక, ఎవరు పీసీసీగా ఉన్నా… సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
ఇక, ఎప్పుడైతే దళిత బంధు ప్రకటించారో అప్పుడే కేసీఆర్ ఓడిపోయినట్టు లెక్క అని కామెంట్ చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… దళితబంధు భువనగిరి పార్లమెంట్‌లోని మొత్తం దళితలకు అమలు చేస్తే వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే.