సిద్ధూకి మధు శుభాకాంక్షలు.. అత్త కూడా శుభాశీస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత ప్రత్యేకం మరి..
పవన్ కళ్యాణ్ – భూమిక కాంబినేషన్ లో వచ్చిన ‘ఖుషి’ సినిమా వీరిద్దరికి ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు యూత్ లో క్రేజ్ మరింత పెరిగింది. అప్పటివరకు రొటీన్ వచ్చిన సినిమా కథలకు ఖుషి సినిమా పూర్తి భిన్నంగా ఉండటంతో భారీ హిట్ ను సొంతం చేసుకోంది. ఎస్.జే సూర్య ఈ ఇగో లవ్ స్టోరీని చాలా బాగా తెరకెక్కించగా.. ఎ.ఎం.రత్నం నిర్మించారు. కాగా తాజాగా భూమిక పవన్ కు వీడియో ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేసింది.
Also Read
ఇక పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కీలక పాత్ర చేసిన నటి నదియా కూడా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకముందు కూడా మీరు మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ అంటూ విష్ చేసింది. కాగా, ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించగా.. నదియా అత్త పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత కలిసిన సినిమా కావడంతో ఆమెకు ఈ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఒక పక్క పవన్ ఇమేజ్‌ని పడిపోకుండా మైంటైన్ చేస్తూనే మరోపక్క అదిరిపోయే ఎమోషన్స్‌ని మిక్స్ చేసి ఈ సినిమాని తీర్చిదిద్దాడు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!