కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో రెండు డోసులుగా అందించారు. అయితే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులను అందిస్తున్నారు. భారత్ బయోటెక్ బూస్టర్ డోసులను ఇంజెక్షన్ రూపంలో కాకుండా చుక్కల మందు రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నది.
Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ను నిర్వహించింది. మూడో దశ ప్రయోగాల కోసం ధరఖాస్తు చేసుకుంది. రెండు దశల ప్రయోగాలు మంచి ఫలితాలను అందించాయని, మూడో దశ ప్రయోగాలకు అనుమతులు లభిస్తే ట్రయల్స్ పూర్తిచేసి వ్యాక్సిన్‌ను చుక్కల మందు రూపంలో తీసుకొస్తామని, ఈ చుక్కల మందును ముక్కుల్లో వేసుకుంటే సరిపోతుందని, బూస్టర్ డోస్‌గా వినియోగించవచ్చని భారత్ బయోటెక్ పేర్కొన్నది.
