Site icon NTV Telugu

LIVE: భద్రాచలంలో తెప్పోత్సవం

భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం ప్రారంభమయింది. రామాలయం ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతోంది. చాలా నిరాడంబరంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారి తెప్పోత్సవంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఆలయ ఈఓ బి.శివాజీ దంపతులు, తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమలవుతున్నాయి.

సకల రాజలాంఛనాల నడుమ ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అర్చకులు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు భద్రాద్రిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్త రామదాసు చేయించిన ఏడువారాల నగలతో సీతారాములను అలంకరించారు అర్చకులు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. తెప్పోత్సవం సందర్భంగా ఉత్సవం జరుగుతున్నంతసేపు భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు. రేపు ఉత్తర ద్వారం వద్ద వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. ఉత్తర ద్వార దర్శనం, తిరువీధి సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

https://www.youtube.com/watch?v=vk028yRtmbU

Exit mobile version