ఒక షాకింగ్ సంఘటనలో, కర్ణాటకలోని బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో వెలుగు చూసింది.. ఓ మహిళ తన షాపింగ్ పూర్తి చేసుకుంది.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడ ఉండే ఫుడ్ కోర్ట్‌లో ఆహారం తీసుకుంటుండగా సీలింగ్ నుండి టేబుల్‌పై చనిపోయిన ఎలుక పడిపోవడంతో ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ సంఘటన జూలై 16 న జరిగింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది..
ఈ ఘటన బెంగుళూరు ఐకియా లో వెలుగు చూసింది.. ఓ మహిళ షాపింగ్ అనంతరం ఆకలిగా ఉందని తినడానికి ఫుడ్ కోర్టుకు వెళ్లారు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, ఫుడ్ తీసుకొని టేబుల్ పై కూర్చొని తిందాం అనుకొనే టైం లో షాకింగ్ సంఘటన జరిగింది. ఒక చనిపోయిన ఎలుక అకస్మాత్తుగా పైకప్పు నుండి పడిపోయి వారి టేబుల్‌పై పడింది.. దాన్ని వాళ్ళు భయభ్రాంతులకు గురిచేసింది. సహాయం కోరేందుకు వారు ప్రయత్నించినప్పటికీ, స్టోర్ నుంచి స్పందన సంతృప్తికరంగా లేదు..ఇక అక్కడే ఉండే ఇద్దరు క్లీనర్లను పిలిచినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది…. వారు కూడా ఏం స్పందించలేదు.. ఎంబసీ గ్రూప్ నుండి మరొక వ్యక్తిని పిలిచాము. ఆ వ్యక్తి IKEA నుండి మరొక మహిళకు ఫోన్ చేసాడు, ఆమె మరొకరికి కాల్ చేసింది అని వివరించారు.. అయినప్పటికీ, వారు ఆ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యడానికి రాలేదు…. అంతేకాకుండా, ఆ ప్రాంతాన్ని తగినంతగా శానిటైజ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ట్వీట్ లో రాసుకొచ్చారు.. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి వెనక్కి వెళ్లిపోయారు.. మరికొంతమంది దాన్ని ఆశ్చర్యకరంగా చూసి.. వాళ్ల తిండిని వాళ్ళు తింటున్నారు..
IKEA బెంగళూరులోని ఫుడ్ కోర్టులో జరిగిన సంఘటన రిటైలర్ యొక్క సాధారణ నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. IKEA సాధారణంగా దాని ఫర్నిచర్, ఇంటి వస్తువులకు గుర్తింపు పొందింది.. అయితే దాని ఫుడ్ కోర్ట్ లో కూడా చాలా మంది కస్టమర్లు ఫుడ్ ను తీసుకుంటారు.. దాదాపు 30% మంది కస్టమర్‌లు, IKEA లోని కోర్ట్ లో ఆహారం కోసం వెళతారు. ప్రపంచంలోని ప్రముఖ ఆహార విక్రయదారులలో ఒకటైన ఈ సంస్థ 2017లో ఆహార విక్రయాల్లోనే 2.24 బిలియన్ డాలర్లను అద్భుతంగా చేసింది.. మరి ఇప్పుడు ఇలా జరగడం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన IKEA క్షమాపణలు చెప్పింది.. IKEAలో జరిగిన అసహ్యకరమైన ఘటనకు మేం క్షమాపణలు కోరుతున్నాం. దీనికి గల కారణాలపై విచారణ జరుపుతున్నాం.. అన్నిరకాలుగా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాం. ఆహార భద్రత మరియు పరిశుభ్రత మా మొదటి ప్రాధాన్యత అని IKEA పేర్కొంది. మా కస్టమర్లు ఎల్లప్పుడూ IKEAలో అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని పొందేలా ఉండాలని మేం కోరుకుంటున్నామని తన ప్రకటనలో పేర్కొంది IKEA.
A dead rat fell on MY food table at Bengaluru IKEA 😪😔 https://t.co/8rK0LN0Om9
— Maya (@Sharanyashettyy) July 17, 2023