కొంతమంది ఎంత చదువుకున్నా జనరల్ నాలెడ్జి బొత్తిగా ఉండదు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కొందరికి అవకాశం ఉండదు. అయినప్పటికీ కొందరు తమకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇలానే పశ్చిమ బెంగాల్‌లోని లిలూహ్ కు చెందిన సురంజన్ కర్మాకర్ అనే రిక్షాడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన రిక్షాలో ఎక్కే ప్రయాణికులను జనరల్ నాలెడ్జికి సంబందించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి ఆటోలో ఫ్రీగా తీసుకెళ్తానని ప్రకటించారు. దీంతో ఆయన ఆటో ఎక్కేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
Read: భూమండలంపై తొలి బీచ్ అదే… ఆనంద్ మహీంద్రా ట్వీట్…
ఇలానే సంకలన్ సర్కార్ అతని భార్య సురంజన్ కర్మాకర్ ఆటో ఎక్కారు. ఆయన ప్రయాణించే సమయంలో జీకే ప్రశ్నలు అడిగారు. అన్ని రకాల జీకే ప్రశ్నలు అడగటంతో భార్యభర్తలు షాక్ అయ్యారు. తాను ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదవలేకపోయానని, తనకు తెల్లవారుజామున 2 గంటల వరకు పుస్తకాలు చదివే ఆసక్తి ఉందని, తాను లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నానని, అద్భత్ తొటివాలా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తన గురించి వస్తుందని చెప్పారు. ఆయన గురించిన పోస్ట్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.