భూమండ‌లంపై తొలి బీచ్ అదే… ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌…

వ్యాపార‌రంగంలో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం అంద‌రికీ అందుబాటులో ఉండే వ్య‌క్తి ఆనంద్ మ‌హీంద్రా.  ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాల‌ను, వింత‌లు, విశేషాల‌ను ఆయ‌ను సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితో పంచుకుంటుంటారు.  ఇప్పుడు భూమండ‌లంలో తొలి బీచ్‌కు సంబంధించిన విష‌యాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న తెలియ‌జేశారు.  భూమండలం మొత్తం నీటితో నిండిపోయిన త‌రువాత, భూమి లోప‌లి టెక్టానిక్ ప్లేట్లలో క‌ద‌లిక‌, భూమి అంత‌ర్భాగంలో ఏర్ప‌డిన పేలుళ్ల కార‌ణంగా మొద‌టిసారి భూమి నీటి నుంచి కొంత బ‌య‌ట‌కు వ‌చ్చింది.  

Read: బ్రేకింగ్: సైదా అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్ధుల దాడి

అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి ప్రాంతం ఝార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్ అని ఈ విష‌యాన్ని ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డైంద‌ని మ‌హీంద్రా పేర్కొన్నారు.  సుమారు 3.2 బిలియ‌న్ సంవ‌త్స‌రాల క్రింద‌ట ఇది జ‌రిగింద‌ని, ఝార్ఖండ్ ప్రాంతం ల్యాండ్ లాక్డ్ స్టేట్‌గా ఉంద‌ని, సింఘ్‌భూమ్‌ను ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ది చేస్తే ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని ఆనంద్ మ‌హీంద్రా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.  

Related Articles

Latest Articles