NTV Telugu Site icon

Beer Bus: చెన్నై నుండి పుదుచ్చేరి.. బీర్ బస్ ప్రయాణం.. ఇందులో విశేషమేమిటంటే..

Beer Bus

Beer Bus

మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల బస్సుల్లో ప్రయాణం చేసి ఉంటారు. కానీ బీర్ బస్ లో ప్రయాణం చేశారా? బీర్ బస్ అంటే బస్సులో బీర్ లు ఉంటాయా? అనే అనుమానం వస్తుందా? బస్సులో బీర్ తాగుతూ ప్రయాణం చేయొచ్చా? బీర్ బస్సులో తాగి వెళ్లొచ్చా అని అడిగితే అందులో కండీషనర్ ఉందని చెబుతున్నారు. చెన్నై నుండి పుదుచ్చేరికి ఒక రోజు ట్రిప్, తిరుగు ప్రయాణం కోసం కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం కానుంది.
Also Read:Sachin Pilot Vs Ashok Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్ లో పోరు.. నిరాహారదీక్షకు దిగిన సచిన్ పైలట్

చెన్నైలో నివసిస్తున్న చాలా మంది పౌరులు ఒక రోజు సరదాగా పాండిచ్చేరిని సందర్శించాలని కోరుకుంటారు. వారాంతాల్లో అలా సరదాగా గడిపే పౌరులు ఎందరో ఉన్నారు. వీరినే లక్ష్యంగా చేసుకుని పుదుచ్చేరికి చెందిన ఓ కంపెనీ కొత్త సర్వీసును అందించాలని నిర్ణయించింది. పుదుచ్చేరిలో కాటమరన్ బ్రూయింగ్ కో-పాండీ అనే కంపెనీ పనిచేస్తోంది. ఈ సంస్థ చెన్నై నుండి పుదుచ్చేరికి ‘బీర్ బస్’ అనే కొత్త టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెల 22న ఈ బీర్ బస్ సర్వీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. చెన్నై నుంచి పుదుచ్చేరికి ఒక రోజు పర్యటనకు ఒక్కొక్కరికి రూ.3,000 ఖర్చు అవుతుంది.
Also Read:Son Killed Father: ఆస్తి వివాదంలో వృద్ధుడి హత్య.. కొడుకు, మనవడి కోసం వెతుకులాట
ఈ బీర్ బస్‌లో రకరకాల ఫుడ్స్ తింటూ పుదుచ్చేరి అందాలను ఆస్వాదించవచ్చు. అదే సమయంలో, ఇది బీర్ బస్సు కాబట్టి, బస్సులో ఎవరూ మద్యం తాగలేరు అని అనుకోకండి. దీనికి నియంత్రణ కూడా ఉంది. ఈ విషయమై సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘బీర్ బస్’ అని పిలుస్తున్నందున, బస్సులో ఆల్కహాలిక్ పానీయాలు తాగవచ్చని ఎవరూ అనుకోవద్దు… బస్సులో బీర్ తాగడానికి అనుమతించబోము అని స్పష్టం చేశారు. అయితే పుదుచ్చేరి ప్రభుత్వం ఆమోదించిన స్థలంలో బస్సు ఆగుతుంది. అక్కడ బీరును అనుమతిస్తామని చెప్పారు. చెన్నై నుంచి అదే రోజు 35 నుంచి 40 మంది పర్యాటకులను పుదుచ్చేరికి తీసుకెళ్లి తిరిగి చెన్నైకి తీసుకొస్తారు. దీనికి సంబంధించిన బుకింగ్ కూడా ప్రారంభమైందని తెలిపారు.
Also Read:Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పుదుచ్చేరి రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ క్రమంలోనే చెన్నై నుండి పుదుచ్చేరికి బీర్ బస్సును ప్రవేశపెట్టింది. గత వారం, పుదుచ్చేరిలోని క్రిమాంబాక్కం ప్రాంతంలోని కట్కుప్పంలోని ఒక ప్రైవేట్ డ్రైవ్-త్రూ బార్, యువ మద్యపాన ప్రియులను ఆకర్షించడానికి మహిళలకు ఈ రోజు ఒక రోజు మాత్రమే మద్యం ఉచితం అని ప్రకటించడం గమనార్హం.