NTV Telugu Site icon

టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ప్రభుత్వం చేతిలో…!

న్యుజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వచ్చే నెల 7న ముగిసిన తర్వాత భారత జట్టు 8 లేదా 9న సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఇంకా తీవ్రతరం కాకపోతే భారత దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని చెప్పారు.

అయితే మేము ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీపడము. అక్కడికి వెళ్తే ఆటగాళ్ళు బయో బబుల్‌లో ఉంటారు. మేము క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. సిరీస్‌లో రాజీ పడకుండా ఉండటానికి మేము అత్యుత్తమంగా ఏది చేయగలిగితే.. అది చేస్తాము అన్నారు. అయితే టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పిన వ్యాఖ్యల పై స్పందిస్తూ… మేము దేనికైనా సిద్ధమే… భారత ప్రభుత్వ సలహా ఏదైనా, మేము దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పిన ఆయన… ఈ పర్యటన ప్రభుత్వం చేతిలో ఉంది అని చెప్పేసారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది.