టీఆర్ ఎస్ పార్టీ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫంక్షన్స్ ఉన్నాయనే టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటేనని… పార్లమెంట్ లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చిందని మండిపడ్డారు.
గతంలో ఆ రెండు పార్టీ లు పొత్తు పెట్టుకున్నాయని.. సీఎం సంతకాలు చేసేటప్పుడు సోయిలో ఉండి చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో సంతకం పెట్టాడు… బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకం చేసాడు.. రేపు ఇంకా దేని మీద పెడతాడో అంటూ సెటైర్లు పేల్చారు బండి సంజయ్. ప్రతి గింజ కొంటానని సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్.. ఉప రాష్ట్ర పతి అవుతాడని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మంత్రుల మాటలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహించారు.
