NTV Telugu Site icon

బ్రేకింగ్‌ : బండి సంజయ్ కి 14 రోజులు రిమాండ్..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్‌ని కార్యాలయంలోకి పంపించి తాళం వేశారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరికి నాటకీయ పరిణామాల నడుమ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్‌ ఎక్సైజ్‌ కోర్టులో బండి సంజయ్‌ను పోలీసులు హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ తరుపు న్యాయవాది సంజయ్‌కి బెయిల్‌ పిటిషన్‌ వేయడంతో కోర్టు ఆ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని జైలుకు తరలించారు.