ఈ నెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యువత ఉద్యమం కోసం బలిదానం చేసుకుంది… ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ది కోసం తాము ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడారో గుర్తుచేస్తున్నామన్నారు. అప్పుడేం చెప్పావ్.. ఇప్పుడేం చేస్తున్నావ్ అన్నారు బండి సంజయ్. ఎంత మంది బలిదానం చేసుకుంటే నీ కళ్ళు చల్లబడతాయో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఎవరూ ఆత్మహత్య లు చేసుకోవద్దని హితవు పలికారు. క్షణికావేశంతో తల్లి దండ్రులను బాధ పెట్టొద్దన్నారు.
Also Read
పక్క రాష్ట్రము ఏమి చేస్తుంది… కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని అడగడం కాదు.. నువ్వేమి చేసావో చెప్పాలన్నారు. ప్రగతి భవన్ లో, ఫాం హౌస్ లో ఉండడానికి కాదు నిన్ను ముఖ్యమంత్రి ని చేసింది. నిరుద్యోగుల బాగోగులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ నెల 16 న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. చిక్కడ పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిరుద్యోగులతో మాట్లాడిన సంజయ్. బీజేపీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో మాటామంతి జరిపారు.
తాజావార్తలు
-
Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!