Site icon NTV Telugu

మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా..? బండి సంజయ్

సీఎం కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్‌ హెచ్చరించారు. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్‌ హౌస్ రాసిస్తావా అని చురకలు అంటించారు బండి సంజయ్‌. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర్‌ అయ్యారు. నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యిందని కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.

సీఎం కేసీఆర్‌ భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నారని…. రండ, పిచ్చి గాడిదకొడుకులు, బేవకూఫ్, నా కొడకా… అంటూ మాట్లాడుతున్నడని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏ భాష నేర్పుతున్నావని నిలదీశారు బండి సంజయ్‌. ఇది తెలంగాణ ప్రజలు వాడే భాషేనా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ముదిరినట్లుందని ఫైర్‌ అయ్యారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దు మీరి… దిగజారి కేంద్ర మంత్రిని ఇష్టానుసారంగా తిట్టారని ఫైర్‌ అయ్యారు.

Exit mobile version