Ban Hookah Bars: హుక్కా బార్లను బ్యాన్ చేసిన కర్ణాటక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్‌లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు..
స్కూల్ పిల్లలు కూడా హుక్కా బార్లకు వస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం తేవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు..12 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల యువకుల వరకు హుక్కా బార్లకు వెళ్తున్నారని అన్నారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. దీంతో హుక్కా బార్‌లను నిషేధించడంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ క్రమంలో మంత్రి ప్రకటించారు..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టాలని, అందుకోసం చట్టం తేవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. వ్యసనానికి దారితీసే హుక్కాలో ఉపయోగించే తెలియని పదార్థాలను హైలైట్ చేశాడు. హుక్కా సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు కలుపుతారో తెలియడం లేదని అన్నారు.. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో దుమపానం నిషేధించబడింది. కర్నాటక ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసింది, ఇందులో బహిరంగంగా పొగాకు వినియోగాన్ని నిషేధించడం, పొగాకు వినియోగం, సిగరెట్ తాగడంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాను పెంచడం ఉంది.. ఇకపోతే ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పాటు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించే చట్టాన్ని సవరించాలని ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు సూచించారు…అలా ఎవరైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం చేస్తారని హెచ్చరించారు..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!