లడ్డూ వేలంపై బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వాడవాడలో వినాయకులను పెడుతున్నారు.. గల్లీకో గణేష్ తరహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం.. లడ్డూ వేలం వేయడం జరుగుతోంది.. గణేష్ విగ్రహాన్ని పెట్టారంటే లడ్డూ వేలం అనేది సాధారణంగా మారిపోయింది.. కానీ, ఆ లడ్డూ వేలాన్ని ఆద్యుడు మాత్రం బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి.. అయితే, కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు ఉండగా.. దానిపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన చేశారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి..
ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం వేస్తామని వెల్లడించారు కళ్లెం నిరంజన్ రెడ్డి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపానికి వచ్చే భక్తులు మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తామన్నారు.. ఈ ఏడాది 21 కిలోల లడ్డూ పెడుతున్నాం.. 15 అడుగుల ఎత్తున గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కారణంగా మండపంలోకి రావడానికి పోవడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేశామని.. గత సంవత్సరం కోవిడ్ కారణంగా లడ్డూ వేలం పాట వేయలేదు.. కానీ, ఈ సంవత్సరం వేలం పాట నిర్వహిస్తామన్నారు.. మరోవైపు.. నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం కలిగినా.. చకచకా ఏర్పాటు జరగుతున్నాయన్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన 56 మంది సిబ్బంది 7 రోజుల నుండి శ్రమిస్తున్నారని.. పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. నవరాత్రుల్లో గణేశుని దర్శించడానికి రోజుకు 10 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని భావిస్తున్నామని.. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థాననికి సంబంధించిన సెట్టింగ్ వేశామని.. వినాయకుని చెవులు, కళ్లు.. కదులుతూనట్టు(మూవీంగ్ ) చేయడం ఈసారి ప్రత్యేకతగా తెలిపారు కళ్లెం నిరంజన్ రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
-
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్‌హామ్! భారత్‌కు లాభమా? నష్టమా?
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!