Site icon NTV Telugu

మనం గొడ్ల సావిట్లో ఉన్నామా.. అసెంబ్లీలో ఉన్నామా : బాలకృష్ణ

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిణామాలపై నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. అందులో మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు.

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్‌ అస్సాసియేషన్‌ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాప్రతినిధుల సంస్కారం కాదన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రాష్ట్ర విభజన తరువాత కూడా ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశారన్నారు. కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version