బద్వేల్ బైపోల్: కుదేలైన జాతీయ పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి.
ఇక కేంద్రంలో రెండోసారి ఘనంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు 3 వేల 125 మాత్రమే. అదేఎన్నికల్లో జనసేనకు 4వేల 283 ఓట్లుపడ్డాయి. గెలిచిన వైసీపీకి 84వేల 955 ఓట్లు వస్తే… టీడీపీ 76 వేల 603 ఓట్లు సాధించింది. ఇదీ గత ఎన్నికల్లో పార్టీలు… వాటికి పోలైన ఓట్ల చరిత్ర. విచిత్రం ఏంటంటే.. బీజేపీకి దగ్గరగా.. కాంగ్రెస్ కంటే ఎక్కువగా నోటాకు 3 వేల 31 ఓట్లు పోలవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఈసారి కూడా అంతే సీన్.. కాకుంటే కాసిన్ని ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఏడో రౌండ్ లో వైసీపీ 8,741 ఓట్ల ఆధిక్యం. ఏడు రౌండ్ల తరువాత వైసీపీకి 60,785 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ 10,301 ఓట్లకు పైగా సాధించగా ఘనమయిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ 2,880 ఓట్లకు మించి సాధించలేకపోయింది. బీజేపీ చివరాఖరికి 21 వేల ఓట్గు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా కమలమ్మ పోటీలో వున్నారు. కాంగ్రెస్ నేతలు తాము భారీగానే ఓట్లు కొల్లగొడతామని భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. చేతికి కోలుకోలేని విధంగా భారీ గాయం అయింది. సంప్రదాయాలను గౌరవించి పోటీనుంచి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!