కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు. కాగా, ఈరోజు బద్వేలు బీజేపీ అభ్యర్థిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన పుంత నురేష్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఏబీవీపీ, బీజేవైఎంలో సురష్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ అభ్యర్థి ఖరారు కావడంతో ఉప ఎన్నిక అనివార్యం కానున్నది.
Read: లఖింపూర్ ఘటనపై నేడు సుప్రీంలో విచారణ…