Site icon NTV Telugu

మరో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్..

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్‌ లో ఈరోజుఆస్ట్రేలియా తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్… అంతర్జాతీయ క్రికెట్‌ టీ 20 ఫార్మాట్‌లో 2,500 పరుగులు అతి వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతక ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే కోహ్లీ 68 ఇన్నింగ్స్‌ ల్లో ఈ మైలురాయిని చేరుకోగా… బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే దానిని చేరుకున్నాడు. అయితే దుబాయ్‌లో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో బాబర్ ఆజమ్ కెప్టెన్సీ లోని పాకిస్థాన్‌ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో176 పరుగులు చేసింది. అందులో కెప్టెన్ బాబర్ 39 పరుగులు చేసాడు. అయితే ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా విజేతగా నిలిస్తే.. ఆదివారం న్యూజిలాండ్‌తో టీ 20 ప్రపంచ కప్‌ లో ఫైనల్‌ లో పాకిస్థాన్ ఆడుతుంది.

Exit mobile version