NTV Telugu Site icon

Ayesha Naseem: 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ క్రికెటర్.?

Ayesha Nasdeem

Ayesha Nasdeem

ఆడవాళ్లు ఇప్పుడు క్రికెట్ ఆటలో కూడా రానిస్తున్నారు.. మగవారితో సమానంగా మ్యాచ్ లలో ఆడుతున్నారు.. క్రికెట్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. క్రికెట్ లో సెలెక్ట్ అవ్వడానికి కనీసం వయస్సు 24 పై ఉండాలి.. కానీ అతి తక్కువ వయస్సు 15 ఏళ్లకే జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం అంటే ఎంత కష్ట పడ్డారో చెప్పడం కష్టమే..15 ఏండ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏండ్లకే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ మాత్రం ఏకంగా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది..

వివరాల్లోకి వెళితే.. అబోటాబాద్‌లో పుట్టిపెరిగిన అయేషాకు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. తన కష్టం, ఇష్టానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో 15 ఏండ్లకే ఆమె.. పాకిస్తాన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట.. ఐసీసీ ఉమెన్స్ టీ20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున ఆడింది. 2020 మార్చి 3న థాయ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేసింది.. ఆ తర్వాత వెస్టీండిస్ లో ఆడిన ఆట తో తనకు గుర్తింపు లభించింది.. పాకిస్తాన్ తరఫున మూడేండ్లలో నాలుగు వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన అయేషా.. వన్డేలలో 33, టీ20లలో 369 పరుగులు చేసింది. అలవకోగా సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన అయేషా బ్యాటింగ్ తో గ్రౌండ్ దద్దరిళ్ళేది..

అలా అతి చిన్న వయస్సులోనే రికార్డులు బద్దలు కొట్టింది.. అలాంటి అయేషా ఇప్పుడు మ్యాచ్ సడెన్ గా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించిందో జనాలకు అర్థం కాలేదు.. అసలు కారణం ఏంటంటే..అయేషా.. రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇస్లాం మతానికి అనుగుణంగా తన జీవితాన్ని మరింత పవిత్రంగా జీవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడింది… ఆ తర్వాత మరో మ్యాచ్ లో ఆడింది.. దైవ చింతన కోసం కేరీర్ ను వదులుకోవడం ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు.. తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి..