NTV Telugu Site icon

Ayalaan Movie:సంక్రాంతి 2024 రేస్ లోకి మరో మూవీ..థియేటర్లు దొరికేనా?

Alayan

Alayan

ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి..

ఇక 2024 సంక్రాంతి ఫైట్ కోసం ఎప్పటి నుంచో వార్ మొదలయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు బిగ్గెస్ట్ క్లాష్ ఉండనుందని దీనిని బట్టే అర్ధం అవుతుంది.. ఇప్పటికే పలు సినిమాలు అఫిషియల్ గా డేట్స్ ను అనౌన్స్ చేసుకున్నాయి,. అలాగే మరికొన్ని భారీ సినిమాలు సంక్రాంతి కోసం రెడీ అవుతున్నాయి.. ముందుగా 2024 సంక్రాంతి సీజన్ లో స్లాట్ ను రిజర్వ్ చేసుకుంది ప్రభాస్.. స్టార్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రోజు 13న మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకేకుతున్న ‘గుంటూరు కారం ‘ సినిమా విడుదల కాబోతుంది.. అలాగే రవితేజ ఈగల్ కూడా రానుంది.. ఇక వీటితో పాటు హనుమాన్ సినిమాను కూడా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.. ఇంకా విజయ్ – పరశురామ్ మూవీ కూడా సంక్రాంతికే రాబోతున్నట్టు దిల్ రాజు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారు. అలాగే నాగార్జున, విజయ్ బిన్నీ కాంబోలో వస్తున్న నా సామిరంగా సినిమా కూడా ఆ రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది..

ఇన్ని తెలుగు సినిమాలు రేస్ లో ఉండగా శివకార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’.. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు.. ఈ సినిమాను ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలక పై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే ప్రథమం..

సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్, అందులోనూ ఏలియన్స్ నేపథ్యంలో తీసే సినిమాలు అంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డారు. ‘అయలాన్’లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని చిత్ర బృందం తెలియజేసింది. పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ ‘అయలాన్’లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసింది. పాన్ ఇండియా సినిమాలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం ఇదే తొలిసారి..ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు..