దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలు ఇప్పటికే వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. పెట్రోల్ ధరలు పెరగడంతో దానికి బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచేందుకు బెంగళూరు ఆర్టీఏ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు మొదటి 1.9 కిలోమీటర్‌కు రూ.25, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు 13 చొప్పున వసూలు చేస్తున్నారు. కాగా ఈ చార్జీల్లో మార్పులు రాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి మొదటి రెండు కిలోమీటర్లకు రూ.30, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు 15 చొప్పున వసూలు చేయబోతున్నారు.
Read: పెట్రోల్ బంకుల వద్ధ ఇలా చేస్తున్నారా… జరాభద్రం…
అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొదటి 5 నిమిషాల వరకు ఎలాంటి వెయిటింగ్ ఛార్జీలు వసూలు చేయకూడదని, ఆ తరువాత ప్రతి 15 నిమిషాల వెయిటింగ్‌కు రూ.5 చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి బెంగళూరు నగరంలో అమలులోకి రాబోతున్నాయి. 8 ఏళ్ల తరువాత ఆటో ఛార్జీలు పెంచుతున్నట్టు ఆటో వాలాలు చెబుతున్నారు. ఆటో ఛార్జీలు కూడా పెరుగుతుండటంతో సామాన్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ పక్కన పెట్టి సైకిల్ లేదా నడిచి వెళ్లడమే ఉత్తమం అని సామాన్యులు వాపోతున్నారు.
