సీఎంపై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ప్రకటన.. అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే పార్టీ పెడుతున్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానంటూ ప్రకటించిన ఓ మాజీ ఐపీఎస్ అధికారిని ఒక్కరోజు తిరగకుండానే ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది… అయితే, అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు చెబుతున్నారు.. కాగా, బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 24 ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.. తనకు న్యాయం చేయాలని కోరింది..
ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆ యువతి 24వ తేదీన ఆమె మృతిచెందారు.. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అతుల్ రాయ్‌కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. అయితే, ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. అమితాబ్ ఠాకూర్ తన విధుల పట్ల నిబద్ధతతో పని చేయడం లేదని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనను తొలగించినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగిపై పోటీ చేస్తానని.. త్వరలోనే పార్టీ కూడా పెడతానని ప్రకటించాడు.. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం చర్చగా మారింది.
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- Tags
తాజావార్తలు
-
Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!