Site icon NTV Telugu

Sudan Crisis: సూడాన్‌లో సంక్షోభం… కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం

Sudan

Sudan

సూడాన్‌లో జనరల్స్ మధ్య సాయుధ పోరాటం కొనసాగుతుండగా, ఆర్మీకి చెందిన అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చారు. సంధిని పొడిగించడానికి సైన్యం అగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‌లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయని పేర్కొంది.

ఆహారం, నీరు అందుబాటులో లేకపోవడం. అవసరమైన ఆరోగ్య సేవలకు అంతరాయాల కారణంగా మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించడంతో బుర్హాన్ సంధిని పొడిగించడానికి సుముఖత వ్యక్తం చేశారు. WHO అంచాల ప్రకారం సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీ మధ్య జరిగిన యుద్ధాలలో కనీసం 459 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. సుడాన్ పరివర్తన పాలక సార్వభౌమ మండలి అధిపతి జనరల్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్‌కు విధేయులైన ఆర్మీ యూనిట్లు, జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగా నేతృత్వంలోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య వారాల తరబడి ఆధిపత్య పోరు తరువాత ఏప్రిల్ మధ్యలో ఈ పోరాటం చెలరేగింది.
Also Read:Tamilnadu: సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడు.. దర్యాప్తులో సంచలన విషయాలు

సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) గతంలో మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి. అది గురువారంతో ముగియనుంది. ప్రాంతీయ కూటమి అయిన ఇంటర్‌గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవలప్‌మెంట్ (IGAD) నుండి వచ్చిన ప్రతిపాదనకు RSF నుండి తక్షణ ప్రతిస్పందన లేదని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. దక్షిణ సూడాన్, కెన్యా, జిబౌటీ అధ్యక్షులు సంధిని పొడిగించడం, రెండు దళాల మధ్య చర్చలు వంటి ప్రతిపాదనపై పని చేశారని మిలిటరీ తెలిపింది. IGADకి బుర్హాన్ కృతజ్ఞతలు తెలిపారని ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది.

Exit mobile version