మామూలు సమయాల్లో సాధారణ వేగంతో వెళ్లే వ్యక్తులు, కాస్తంత వర్షం కురవగానే యమా స్పీడుగా దూసుకుపోవాలని చూస్తుంటారు. వర్షం పెరగకముందే ఇంటికి చేరుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంటికి చేరుకోవాలని అనుకోవడం మంచిదే. కానీ, దానికోసం పరిమితికి మించి వేగంగా వాహనం నడిపితే ఎన్ని అనర్ధాలు వస్తాయో చెప్పక్కర్లేదు. నగరంలో ఎక్కడ గోతులు ఉంటాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఒపెన్ చేసి ఉంటాయో చెప్పడం కష్టం. ఇక, వర్షం కురిసిన సమయంలో వాటిని గుర్తించడం మహాకష్టం. వర్షం కురిసేటప్పుడు వేగంగా వెళ్లాలి అనుకోవడం కంటే క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అనుకొని ప్రయాణం చేయడం ఎంతో శ్రేయస్కరం. కిందపడినా, మ్యాన్‌హోల్‌లో పడినా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొంతమందైతే, పక్కన దారి ఉన్నప్పటికీ బైక్‌లను నీళ్లలోనుంచి వేగంగా నడుపుతుంటారు. దానివలన పక్కన వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోరు. రోడ్డుపై ఎవరూ లేనప్పుడు ఎలా వెళ్లినా పర్వాలేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు అందరిని పట్టించుకొని పోవడం మంచిది. లేదంటే మనతో పాటు పదిమంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Read: కేరళలో కరోనా టెర్రర్…సండే లాక్‌డౌన్…