కేర‌ళ‌లో క‌రోనా టెర్ర‌ర్‌…సండే లాక్‌డౌన్‌…

కేర‌ళ‌లో క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.  క‌ట్ట‌డి కోసం నైట్ క‌ర్ఫ్యూను విధించిన‌ప్ప‌టికీ కంట్రోల్ కావ‌డంలేదు.  ప్ర‌తిరోజూ 30 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి.  దీంతో కేర‌ళ ముఖ్య‌మంత్రి కట్ట‌డి కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఆదివారం రోజున రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈరోజు క‌రోనా క‌ట్ట‌డిపై ఆయ‌న అధికారుల‌తో స‌మీక్షించారు.  అనంత‌రం ఆదివారం రోజున లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ రాష్ట్రంలో 29,682 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, 142 మంది మృతి చెందారు.  ఇక 24 గంటల్లో 25,910 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 17.54 గా ఉండ‌టంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌యింది.  నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించింది.  

Read: రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ దూకుడు… పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో…

Related Articles

Latest Articles

-Advertisement-