Site icon NTV Telugu

ఎస్పీకి షాక్.. బీజేపీలోకి ములాయం కోడలు?

యూపీలో బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్న వేళ రొటీన్ కి భిన్నంగా జరిగింది. సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ త్వరలో బీజేపీ జెండా పట్టుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్​వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. 2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున అర్పనా సింగ్ పోటీ చేశారు. ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. గత కొన్నాళ్ళుగా బీజేపీ నేతలు వలసల బాట పట్టిన సంగతి తెలిసిందే.

అపర్ణా యాదవ్ బీజేపీలోకి వస్తే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడం ఖాయం అంటున్నారు. రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి ఇటీవల సమాజ్​వాదీ పార్టీలో చేరారు. బీసీ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇన్నేళ్లయినా ఆ వర్గాన్ని పట్టించుకోలేదని ఈ మేరకు ఆరోపించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల్లో ఎస్పీ ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ నేతలు మాత్రం మళ్ళీ బీజేపీ గెలుపు ఖాయం అని ధీమాతో వున్నారు.

Exit mobile version